రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో గట్టిగా గళం ఎత్తాలి అని వైసీపీ ఎంపీలకు సూచించారు వైఎస్ జగన్. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తు ఎంతో కీలకం. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం. కేంద్ర క్యాబినెట్లో ఇద్దరు టీడీపీ మంత్రులున్నా.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించక పోవడం దారుణం. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు టీడీపీ ఎంపీలు.
ఆంధ్రుల హక్కుగా, ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైనా కాపాడుకోవాలి. ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి. నియోజకవర్గాల పునర్విభజనపై రకరకాలుగా చర్చ. ఉత్తరాదిలో పెరిగనట్లుగా దక్షిణాదిన సీట్లు పెరగవన్న ప్రచారం. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలా పార్లమెంటలో ప్రస్తావించాలి. కేంద్రం, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్ చేయాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు. మొదట్లో ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించిన దేశాలు ఆ తర్వాత బ్యాలెట్ విధానానికే మారాయి అని వైఎస్ జగన్ తెలిపారు.