మహిళా సంఘాలకు రూ. 21,632 కోట్ల రుణాలు !

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రేపు పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025 విడుదల చేయనుంది సర్కార్. ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృందాల విజయాలతో పాటు భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశిస్తూ ఇందిరా మహిళ శక్తి మిషన్ – 2025 కొనసాగనుంది. మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపద సృష్టి పై ఫోకస్ చేయనుంది. ఐకమత్యమే మహాబలం అనే నానుడిని నిజం చేసేలా ఒకే గొడుగు కిందకు గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాలు కొనసాగనున్నాయి.

స్వయం సహాయక సంఘాల పరిధిని విస్తృతపరిచేలా సభ్యుల అర్హత వయసు పెంపు ఉండనుంది. కిశోర బాలికలు, వయోవృద్ధుల ఆర్థిక భద్రత, సామాజిక మద్దతు కోసం నూతన స్వయం సహాయక సంఘాలు పని చేయనున్నాయి. సభ్యుల కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గింపు, గరిష్ట వయసు 60 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంచనుంది. ఈ ఏడాదిలో మహిళా సంఘాలకు రూ. 21,632 కోట్ల రుణాలు అందించేలా ముందుకు సాగుతోంది సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news