టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు సెలబ్రేట్ చేసుకున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లో చాలా మంది యువత జాతీయ జెండాలను చేతబట్టుకుని వీధుల్లోకి వచ్చి ఇండియా ఇండియా అంటూ హోరెత్తారు. కాగా,నగరంలో పలుచోట్ల వారిమీద పోలీసులు లాఠీచార్జి చేసినట్లు తెలిసింది.
తాజాగా టీమిండియా విజయంపై జనసేన నేత నాగబాబు స్పందించారు. అదృష్టానికి విజయంతో సంబంధం లేదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు అన్ని మ్యాచుల్లోనూ టాస్ ఓడి విజయాన్ని నమోదు చేసిందని, 12 ఏళ్లకు చాంపియన్స్ ట్రోఫీ సాధించిందని గుర్తుచేశారు. జనసేన పార్టీ కూడా 12 ఏళ్లకు జీరో ఏమ్మెల్యే నుంచి వందశాతం స్ట్రైక్ రేటుతో 22 ఎమ్మెల్యేలు గెలిచిందన్నారు. ఈ విషయంలో టీమిండియా, జనసేన ఒక్కటే అని పేర్కొన్నారు.