పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

-

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసును నేడు సుప్రీంకోర్టు మరోసారి విచారించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై బుధవారం మరోసారి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఇప్పటికే నోటీసులు అందాయి.

అసెంబ్లీ సెక్రెటరీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి. తాజాగా దీనిపై విచారించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నోటీసులు ఎవరైతే అందుకున్నారో ఈనెల 25లోగా ఎట్టి పరిస్థితుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం సంచలన ఆదేశాలిచ్చింది. దీంతో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news