తెలంగాణ సీఎం రేవంతన్న చెప్పింది అక్షర సత్యమని, దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించ కపోవడం తగదని ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల అన్నారు. కేంద్రం తీసుకొస్తున్న డీలిమిటేషన్ విధానంపై దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయంగా దుమారం రేగుతోంది. దీనిపై పార్లమెంట్ లో సైతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ విధానంపై దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునిస్తున్నారు. దీనిపై షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు సంచలన విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె.. డీ లిమిటేషన్ ద్వారా సౌత్ స్టేట్స్ పై నిజంగా బీజేపీది ప్రతికారమేనని, దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రభావం లేనందుకే ఈ కక్ష్య సాధింపు చర్య అని మండిపడ్డారు. పార్లమెంట్ సౌత్ ప్రాతినిథ్యం తగ్గించే కుట్రలో తగ్గించే కుట్రలో భాగమని.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీఎం రేవంత్ అన్న చెప్పిన మాటలు అక్షర సత్యమని తెలిపారు. జనాభా ప్రాతిపాదికన డీ లిమిటేషన్ చేయడం అంటే.. కుటుంబ నియంత్రణ పాటిస్తున్న దక్షిణాది రాస్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నట్టేనని స్పష్టం చేశారు.