హోలీ పండుగను కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్లోని జిల్లా కార్యాలయంలో తన అనుచరులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు.పార్టీ కార్యకర్తలు, అభిమానులు అంతా రంగులు పూసుకుని సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ..
హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలు,హిందూ బంధువులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశవ్యాప్తంగా హోలీ పండుగను ప్రజలు జరుపుకుటున్నారని చెప్పారు. హిందూ సమాజం ఎప్పుడూ ఓకే తాటిపై ఉండాలని ఆకాంక్షించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా అంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.కులాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలన్నారు. హోలీ సందర్బంగా గాలి, నీరు, నిప్పుతో పరిహాసం వద్దని.. స్నానాల కోసం చెరువులు,నదుల వద్దకు వెళ్లి ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు.