గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గల ఓ భారీ అపార్ట్మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అనుకోకుండా అపార్ట్‌మెంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీనికి తోడు దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగి అందులోని జనాలు బయటకు రాలేకపోయారని తెలుస్తోంది.
ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్లు సమాచారం. అంతేకాకుండా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని అపార్ట్మెంట్‌లోని ప్రజలను బయటకు తీసుకొచ్చారు.50 మంది వరకు అగ్నిమాపక సిబ్బంది కాపాడినట్లు తెలుస్తోంది.కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.