రూ.3లక్షలు డిమాండ్.. నో చెప్పారని బిర్యానీ సెంటర్ నిర్వాహకులపై దాడి!

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్ట్రీట్ వ్యాపారులపై కొందరు రౌడీ మూకలు దాడికి పాల్పడ్డాయి. బిజినెస్ మంచిగా నడుస్తుందని కన్నేసిన కొందరు స్థానిక వ్యాపారులను డబ్బులు డిమాండ్ చేయగా.. అందుకు వారు నో చెప్పారు. దీంతో వారిపై కొందరు దాడికి పాల్పడ్డారు.

స్థానికుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ మారేడుపల్లి పీఎస్ పరిధిలోని ఓ బిర్యాని సెంటర్‌లో అన్ లిమిటెడ్ ఫుడ్ అంటూ ఆఫర్ పెట్టి నడిపిస్తున్నారు. బిర్యానీ సెంటర్ బాగా నడుస్తుందని స్థానిక నాయకులు రూ.3 లక్షలు డిమాండ్ చేయగా.. అందుకు వారు నిరాకరించారు. దీంతో స్థానిక రౌడీలు వంట సామగ్రిని కిందపడేసి, బిర్యానీ సెంటర్ నిర్వాహకులపై దాడికి యత్నించారు.పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

https://twitter.com/ChotaNewsApp/status/1900715002891563207

Read more RELATED
Recommended to you

Latest news