రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలవదా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఇప్పటకీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ.. ఉదయం 5 గంటలకు మైహోం బూజాకు రేవంత్ రెడ్డి వెళ్తున్నాడని తెలిపారు. సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసు అన్నారు. బీజేపీ నేతల బాగోతాలు కూడా నా దగ్గర ఉన్నాయని బాంబ్ పేల్చారు.

పదేళ్ళు అధికారంలోకి ఉన్న మాకు ఎవరు ఎంటో అన్నీ తెలుసు అని తెలిపారు కేటీఆర్. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన కామెంట్స్‌ను ఎందుకు ఖండించడం లేదని ఆగ్రహించారు. రాజాసింగ్‌ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా? అంటూ ప్రశ్నించారు కేటీఆర్.