తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇదే సందర్భంలో శష బిషలు అక్కర్లేదు అధ్యక్షా.. సభా నాయకుడిగా 42 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు సాధించడానికి తాను నాయకత్వం వహిస్తానని పేర్కొన్నారు. ఈ సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తానని తెలిపారు. అన్ని పార్టీలను కలుపుకొని పోతాను. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కి విజ్ఞప్తి చేస్తున్నాను.
మనందరం కలిసి కట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు సభా నాయకులు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, సీపీఐ నేత సాంబశివరావు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, మరికొంత మంది రాజకీయ పార్టీల నాయకులంతా కలిసి ప్రధాని మోడీ దగ్గరికి వెళ్దాం. చట్టాలు అన్ని కూడా పాలన సౌలభ్యం కోసం మనం చేసుకున్న చట్టాలేనని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు మేలు చేయడం కోసం 100కి పైగా రాజ్యాంగ సవరణలు చేసుకున్నాం.ఈరోజు అవసరం అయితే రాజ్యాంగ సవరణ అయినా చేపట్టడం ద్వారా బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో 42 శాతం పెంచడానికి అవసరమైన చట్టపరమైన చర్యలన్నింటినీ కూడా మనం తీసుకోవాలి అని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.