హైకోర్టు న్యాయమూర్తి నగేష్ సంచలన తీర్పు ఇచ్చారు. హైకోర్టును తప్పు దోవ పట్టించారు. పెండింగ్ లో ఉండగా.. మరో బెంచ్ లో ఆర్డర్ తీసుకోవడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భూమికి సంబంధించిన వివాదం కొనసాగుతుంది. కేసు పెండింగ్ లో ఉంది. విచారణలో ఉండగానే.. మరో కోర్టులో కొత్త పిటిషన్ ను దాఖలు చేశారు. ఇది గమనించిన సదరు న్యాయమూర్తి.. ఒక బెంచ్ లో ఉండగానే.. మరో బెంచ్ లో పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంలో నగేష్ సంచలన తీర్పు ఇచ్చారు. పిటిషనర్ కు రూ.కోటి జరిమానా విధించారు. కేసు విచారణ అయ్యేంత వరకు ఓపిక లేదా..? ఎందుకు మరో బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసారని ప్రశ్నించగా.. పిటిషనర్ వైపు నుంచి సమాధానం లేకపోవడం గమనార్హం. దీంతో హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.