తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కుల వ్యవస్థ కారణంగా దళితులు వివక్షకు గురయ్యారని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇవాళ తెలంగాణలో చరిత్రలో నిలిచిపోయే రోజు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ కమిట్ మెంట్ కి ఎస్సీ వర్గీకరణ నిదర్శనం అని పేర్కొన్నారు. వివక్షను రూపు మాపేందుకు రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని లోకూర్ కమిటీ సిఫారసు చేసిందని తెలిపారు. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ యువతకు ఆదర్శం అన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. చాతుర్వర్ణ వ్యవస్థ కాలక్రమే పంచమ వ్యవస్థగా మారిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీకి వచ్చిందని తెలిపారు. అంబేద్కర్, పూలే సామాజిక సమానత్వం కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ రాష్ట్రంలో 32 కులాలు ఉన్నాయి. కుల వ్యవస్త దేశాన్ని వీక్ చేస్తుందని గాంధీ చెప్పారు. అసమానతతోనే అణగారిన వర్గాల్లో అభద్రత భావం ఏర్పడిందని తెలిపారు.