ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ తాజాగా ఆమోదం తెలిపింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాజకీయాలను పక్కనకు పెట్టి అందరూ సంపూర్ణ మద్దతు తెలిపారు. జనాభా ప్రకారం.. కులగణన సర్వే చేపట్టి బీసీ రిజర్వేషన్ 42 శాతం, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలిపినట్టు గుర్తు చేశారు.
ఫిబ్రవరి 04వ తేదీగా సోషల్ జస్డీస్ డే గా ప్రకటించుకున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిస్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది అని.. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. 1960లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితుడిని సీఎం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. దళితుడైన మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా పార్టీ నియమించింది.