రేపు తెలంగాణ కేబినెట్ భేటీ..!

-

తెలంగాణ కేబినెట్ రేపు సమావేశం కానున్నది. ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ హాల్ -1లో కేబినెట్ భేటీ అయి రాష్ట్ర బడ్జెట్ కి ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత ఉదయం 11:14 నిమిషాలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ని  శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. తొలుత ప్రవేశపెట్టిన ఓటు ఆన్ బడ్జెట్ మినహా.. ఇది రేవంత్ సర్కార్ ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ కావడంతో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఏ పథకానికి ఏ మేరకు కేటాయింపులు ఇవ్వబోతున్నది అనేది ఆసక్తిగా మారింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు రాజీవ్ యువ వికాసం కోసం 6వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు నిన్ననే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిధులను బడ్జెట్ లో ప్రవేశపెడుతారా..? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు రూ.3.20లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news