తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టులో ఇవాళ విచారణకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు రానుంది. గత విచారణ సందర్భంగా స్పీకర్‌తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు సుప్రీంకోర్టు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అందించింది స్పీకర్ కార్యాలయం.

10 నెలలు దాటినా ఎందుకు పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడం లేదని స్పీకర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని గత విచారణలో స్పీకర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇక ఇవాళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణ చేయనుంది. మరి ఇవాళ విచారణలో ఎలాంటి తీర్పు సుప్రీం కోర్టు ఇస్తుందో చూడాలి.