ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 1 & 2..?

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ మొదలు పెట్టిన ఎన్.టి.ఆర్ సినిమా క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతుంది. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి, నందమూరి బాలకృష్ణ ముగ్గురు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈమధ్య వచ్చిన పోస్టర్ కూడా నందమూరి ఫ్యాన్స్ ను అలరించాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెర మీద చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా కూడా బాహుబలిలా రెండు పార్టులలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. మొదటి పార్టులో ఎన్.టి.ఆర్ బాల్యం, సినిమా కెరియర్ ప్రస్థావన చేస్తారట. ఇక రెండో పార్ట్ లో రాజకీయ రంగప్రవేశం.. రాజకీయ ప్రక్షాళణ లాంటి విషయాలను తెరకెక్కిస్తారట. మొత్తానికి బాహుబలి రూట్ లోనే ఎన్.టి.ఆర్ బయోపిక్ రాబోతుందని టాక్.

అంతేకాదు రెండు సినిమాలు కేవలం 10 రోజుల గ్యాప్ తో వస్తాయట. జనవరి 9న ఎన్.టి.ఆర్ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక రెండో పార్ట్ జనవరి 25న రిలీజ్ చేస్తారట. అంటే ఎన్.టి.ఆర్ పార్ట్ 1 థియేటర్ లో ఉండగానే సెకండ్ పార్ట్ కూడా వస్తుందన్నమాట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కాని ఎన్.టి.ఆర్ పార్ట్ 1, 2 అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే హడావిడి మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news