“ఎన్నారై” లకు “నిర్మల” మైన హామీ..!!

-

రెండు రోజుల క్రితం ప్రవేసపెట్టిన కేంద్ర బడ్జెట్ పై ఒక్కొక్కరి స్పందన ఒక్కో రకంగా వినిపిస్తోంది. నిధుల కేటాయింపు విషయంలో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తోంటే,  మరికొంత మంది నిధుల కేటాయింపులో కేంద్ర నిర్ణయం సరైనదేనని సమర్ధిస్తున్నారు. అయితే విదేశాయలో ఉండే ఎన్నారైల సంపాదనపై కూడా పన్ను విధించారని మీడియాలో వచ్చిన వార్తలకు ఎన్నారైలు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను విషయంలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే..

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించి, మీడియాలో వచ్చిన వదంతులను తోసిపుచ్చి ఎన్నారైలకు క్లారిటీ ఇచ్చారు. “ఎన్నారైలు దుబాయ్ లో ఉండి సంపాదించుకునే వాటి మీద ఎలాంటి పన్ను విధించమని ఉరటనిచ్చారు. అయితే అక్కడ  సంపాదించుకునే వారికి, భారత్ లో కూడా  ఆస్తులపై వచ్చే అద్దె వంటి ఆదాయాల  మీద మాత్రం ఆదాయపు పన్ను తప్పక విధిస్తామని వివరించారు. ఈ నేపధ్యంలోనే..

ఎన్నారైల హోదాపై ప్రస్తుత బడ్జెట్ లో వచ్చిన మార్పుల వలన గల్ఫ్ దేశాలలో పనిచేసే భారత కార్మికులకు, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆర్ధిక మంత్రి హామీ ఇచ్చారు. కొంతమంది ఎన్నారై హోదాను అడ్డుపెట్టుకొని ఇక్కడ ఆస్తులపై వచ్చే ఆదాయానికి పన్ను ఎగవేత వంటి పనులకు పాల్పడుతున్నారని, అలంటి వారి ఆటలు సాగనివ్వకుండా చేయడానికే ఎన్నారై నిర్వచనంలో మార్పులు చేసామని చెప్పారు. ఇంతకు ముందు వరకు ఒక సంవత్సరంలో 183 రోజులు విదేశాలలో ఉండే భారతీయులను ఎన్నరైలుగా పరిగణలోకి తీసుకునే వారు, తాజా బడ్జెట్ లో ఈ కాల పరిమితిని 245 రోజులకు పెంచారు.

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news