పెళ్లి చేస్తే కట్నం ఇవ్వాలని కూతురిని రేప్ చేసిన తండ్రి…!

-

సాధారణంగా కూతురికి పెళ్లి చేయడం అనేది తల్లి తండ్రుల బాధ్యత. అందుకోసం రూపాయి రూపాయి దాచుకుని కష్టపడుతూ ఉంటారు. కట్నం కోసం ఆస్తులు అమ్ముతారు… కష్టం అయినా సరే ఇష్టంగా భరిస్తూ ఉంటారు. దీని కోసం తీవ్రంగా కష్టపడతారు. మన భారత దేశంలో అయితే ఇది ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో తల్లి తండ్రుల కష్టాలు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి.

అయితే ఒక తండ్రి మాత్రం కట్నం ఇవ్వాలని కూతురిని రేప్ చేసాడు. తెలంగాణా రాష్ట్రం నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూతురికి పెళ్లి చేస్తే కట్నం ఇవ్వాల్సి వస్తుందని భావించిన తండ్రి ఆమెను రేప్ చేసాడు. తన కూతురు కవితను రేప్ చేసాడు. ఆ తర్వాత తల్లి తండ్రులు, అన్న ఆమెను బండ రాళ్ళతో దారుణంగా కొట్టారు. దీనితో ఆమె పరిస్థితి విషమంగా మారింది.

పరిస్థితి విషమించడంతో గమనించిన గ్రామస్తులు కలుగ జేసుకుని ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం కవిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లి తండ్రులను అరెస్ట్ చేసినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news