గోవా వెళ్ళే వారికి షాకింగ్ న్యూస్…!

-

గోవా టూర్ కి వెళ్ళే చాలా మంది ఎక్కువగా మద్యంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే బీచ్ లోనే కాకుండా హోటల్స్ లో కూడా మందు కిక్ ఉంటుందని, తక్కువ ధరకే మద్యం వస్తుందని, ఎంతైనా తాగొచ్చు అంటూ పర్యాటకులు భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా యూత్ సొంత ఊర్లలో తాగలేని వారు గోవా వెళ్లి ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.

ఇది అందరికి తెలిసిన విషయమే… అయితే ఇప్పుడు అలాంటి వారికి గోవా ప్రభుత్వం ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. మద్యం ధరలను అమాంతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. 20 శాతం నుంచి 50 శాతం వరకు పెంచుతున్నామని గోవాలోని బిజెపి సర్కార్ ప్రకటించడం గోవా టూర్ కి వెళ్ళే వారికి ఒక్కసారిగా షాక్ తగ్లినట్లు అయింది.

మందు అక్కడ తక్కువకి దొరుకుతుంది ఎంజాయ్ చేయవచ్చు అని భావించిన వాళ్లకు ఈ వార్త కాస్త ఇబ్బందికరమే. ఈ ఆదేశాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీని కారణంగా గోవాకు వంద కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. సామాన్యుడిపై పన్నుల భారం లేకుండా జస్ట్ ఎక్సైజ్ డ్యూటి పెంచామని చెప్పడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news