విక్టరీ వెంకటేష్ పక్కన సాహస వీరుడు సాగర కన్య సినిమా లో హీరోయిన్ గా చేసిన శిల్పా శెట్టి అందరికీ గుర్తే ఉంటుంది. యోగా టీచర్ గా మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా అవకాశాలు అందుకుంటూ వ్యాపారాలు చేస్తూ కెరియర్ సాగిస్తోంది శిల్పాశెట్టి. టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ తో ‘భలేవాడివి బాసు’ అనే సినిమా చేసిన తర్వాత మరొక సినిమా చేయలేదు. 2007 వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించిన శిల్పాశెట్టి కొద్దిగా బ్రేక్ తీసుకుని 2014లో రీ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రావడం లేదు.
దీంతో సౌత్ సినిమా ఇండస్ట్రీ పై కన్ను వేసిన సాగర కన్య శిల్పాశెట్టి సౌత్ ఆడియన్స్ మరియు ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు ఈ అమ్మడు చేస్తున్న ప్రయత్నాలు తెలుసుకుంటే డ్యాన్స్ చేస్తారు మీరు. ఏం చేసిందంటే ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండియా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బుట్టబొమ్మ పాటకు ఈ అమ్మడు కూడా డాన్స్ కట్టింది.
తెలుగు పాటకు శిల్ప శెట్టి డాన్స్ వేసింది అంటూ మీడియా కోడై కూయడం.. ప్రేక్షకుల్లో చర్చ జరగడం మేకర్స్ దృష్టిలో పడటం తో ఏదో ఒక అవకాశం రాకపోదా..? అన్న ఫీలింగ్ లో శిల్పా శెట్టి ఉందంట. మరి సౌత్ సినిమా ఇండస్ట్రీ ఆకాశం ఇస్తుందో లేదో చూడాలి.