ఆంధ్రప్రదేశ్ లో మహిళా భద్రతే లక్ష్యంగా ప్రవేశ పెట్టిన దిశా యాప్ లో తొలి సక్సెస్ స్టోరీ నమోదు అయింది. విశాఖ నుంచి విఅజయవాడ వస్తున్న బస్ లో ఒక వ్యక్తి మహిళా అధికారిని వేధించడంతో ఆమె దిశా టీంకి సమాచారం ఇచ్చారు. తెల్లవారు జామున 4;30 గంటలకు దిశా టీం ఎమర్జెన్సీ కాల్ అందుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు 5 నిమిషాల్లో ఏలూరుకి చేరుకున్నారు.
సమీపంలోని ఎమర్జెన్సి సెంటర్ కు కాల్ వెళ్ళడంతో వెంటనే వేధింపులకు పాల్పడిన అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనితో పోలీసులకు ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలిపారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశా యాప్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో దిశా అత్యాచార ఘటన అంతరం జగన్ దిశా బిల్లుని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.
రాజమండ్రిలో తొలి దిశా పోలీస్ స్టేషన్ ని కూడా ఆయన ప్రారంభించారు. దీని ద్వారా మహిళల భద్రత మరింత మెరుగు అవుతుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామం మాత్రం ఇప్పుడు మహిళల్లో ప్రభుత్వంపై అభిప్రాయం మార్చడం ఖాయమని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఇలాగే ఉంటే ఇబ్బంది ఉండదు అంటున్నారు. కాగా దీన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది.