స్టాలిన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లు తిరస్కరణ

-

తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నీట్ ప్రవేశ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలంటూ పంపిన వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడించారు. 2021, 2022 లో రాష్ట్ర శాసనసభ రెండుసార్లు నీటి వ్యతిరేక బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించింది. అప్పటి నుంచి పెండింగ్ లోనే ఉంది. తాజాగా శాసనసభలో స్టాలిన్ మాట్లాడుతూ నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి తిరస్కరించినట్టు చెప్పారు.

అన్ని ఆధారాలతో కేంద్రానికి పంపించినట్టు స్టాలిన్ తెలిపారు. అయినా కూడా నీట్ నుంచి తమిళనాడును మినహాయించేందుకు కేంద్రం నిరాకరించిందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలను అవమానించడమే బీజేపీ ఉద్దేశమని తెలిపారు. కేంద్రం పై పోరాటాన్ని ఆపేది లేదన్నారు. న్యాయపరంగా పోరాటాన్ని ఆపేది లేదన్నారు. న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 09న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news