ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ కొత్త ఆలోచనలతో వస్తాను .గతంలో నేను సెల్ఫోన్ గురించి మాట్లాడాను.. ప్రస్తుతం సెల్ఫోన్ అందరికీ అత్యవసరమైంది.
డ్వాక్రా సంఘాలను కూడా నేనే ప్రవేశపెట్టా..ఈ రోజు డ్వాక్రా సంఘాలు లేకపోతే ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అవే లేకపోతే ఏ రాజకీయ పార్టీ ఇప్పుడు ముందుకు పోలేని పరిస్థితి. ఆడబిడ్డలు కట్టెల పొయ్య మీద వంటలు చేయకూడదని.. 20 ఏళ్ల క్రితమే దీపం పథకం కింద గ్యాస్ పొయ్యిలను అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తన ఆలోచనలను అర్థం చేసుకున్నవారు భవిష్యత్లో బాగుపడతారు. అర్థం చేసుకోలేని వారు నష్టపోతారు’ అని చంద్రబాబు వెల్లడించారు.