కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో చట్టం చేసిన వక్ఫ్ బోర్డు బిల్లు సవరణలపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.అయితే, అందులోని కొన్ని సవరణలు ముస్లిం హక్కులను, వక్ఫ్ బోర్డు అధికారాలను కాలరాసేలా ఉన్నాయని ఇద్దరు ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, జావేద్ ఖాన్‌లతో పాటు పర్సనల్ లా బోర్డు సైతం పిటిషన్లు దాఖలు చేసింది.
ఈ క్రమంలోనే సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట ఆ పిటిషన్లను మెన్షన్ చేశారు. త్వరితగతిన విచారణ చేపట్టాలని వినతి చేశారు. పిటిషన్లు దాఖలు చేసినవారిలో ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు రాజకీయ పార్టీలు ఉండగా.. మెన్షనింగ్‌ను మధ్యాహ్నం పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా వెల్లడించారు.