కులవివక్షపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘ఇప్పటికీ కులం పేరుతో వివక్ష చూపించే దౌర్భాగ్యకరమైన పరిస్థితి దేశంలో ఉండటం బాధాకరం.
రాజస్థాన్ ప్రతిపక్ష నేత గుడికి వెళ్తే గుడి మైలపడిందని సంప్రోక్షణ చేశారు.బాన్సువాడ ప్రాంతంలో ఒక చాయ్ దుకాణంలో రెండు గ్లాసుల పద్ధతి ఇంకా ఉంది. గుడిలో సహపంక్తి భోజనాలు చేస్తే పాలతో శుద్ధి చేసిన ఘటనలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనేవి కేవలం మాటల్లోనే ఉన్నాయి చేతల్లో చూపించాలి’ అని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.