జనగామ జిల్లాల్లో పలు చోట్ల ఈదురు గాలులతో భారీ వడగండ్ల వాన కురిసింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. కొంత ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. జనగామ, లింగాల, గణపురం, రఘునాథపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి పంట నేల రాలింది. పలు చోట్ల రహదారులపై చెట్లు నేలకు ఒరిగాయి. అకాల వర్షం రైతులను నిండా ముంచిందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని యాయిశ్చర్ లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో అన్నదాతలు.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం రాశులపై టార్సిన్ పట్టాలు కప్పి తడవకుండా ధాన్యం రాశులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత వారం క్రితం కురిసిన వర్సానికి కుదేలు అయిన రైతన్నలు మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆవేదన చెందుతున్నారు. భారీ ఈదురు గాలులతో పెనుబల్లి మండలంలో విద్యుత్ సైతం నిలిచి అంధకారంగా మారింది.