ప్రతిపక్ష ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని క్యాబినెట్ భేటీలో మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అధికారుల అవినీతి పై తరచూ చర్చలు సరికాదని.. ఎవ్వరి శాఖయల పరిధిలోని అంశాలపై వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం వివిధ అంశాలపై ఆయన మంత్రులతో చర్చించారు. జగన్ వైఖరి ఎలా ఉందో కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. కుట్రలను సమర్థంగా తిప్పి కొడుతూనే ప్రజలను చైతన్య పరచాలని సూచించారు చంద్రబాబు.
అధికారులు అవినీతి పై తరచూ చర్చ జరుగుతున్న సీఎం ప్రస్తావించారు. రాజకీయంగా అంతా బాగున్న అధికారుల స్థాయిలో ఈ తరహా చర్చలు సరికాదని హితవు పలికారు. ఏ శాఖ పరిధిలో మంత్రులు ఆ శాఖ అంశాలపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. బ్యూరోక్రసీలో అవినీతి పై ఈ మధ్య ఎక్కువగా చర్చకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఇన్ చార్జీ మంత్రుల పర్యటనలలో మూడు పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలన్నారు.