వేసవి కారణంగా పండ్ల రసాలను ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త వహించాల్సిందే..!

-

చాలా శాతం మంది ఇంట్లో తయారు చేసుకునే ఆహారంతో పాటుగా, బయట అందుబాటులో ఉండే ఆహార పదార్థాలను మరియు పండ్ల రసాలను తరచుగా తీసుకుంటూ ఉంటారు. అయితే వాటివలన ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయని, కేవలం ఆరోగ్యకరమైనవి మాత్రమే తీసుకోవాలని భావిస్తారు. కాకపోతే కొంత శాతం మంది బయట పండ్ల రసాలు ఆరోగ్యకరమని భావించి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా, ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వలన వేడి నుండి ఉపశమనం పొందడానికి చల్లగా పండ్ల రసాలను తీసుకుంటూ ఉంటారు. అయితే కొంత శాతం మంది వీటిని తీసుకున్న తర్వాత ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని భావిస్తారు.

దీనికి సంబంధించి నిపుణులు ఈ విధంగా సూచనలను ఇస్తున్నారు. పరిశుభ్రత లేకుండా కొన్ని ప్రాంతాల్లో ఐస్ కలిపిన పానీయాలను తయారు చేస్తూ ఉంటారు. అందువలన గొంతు ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు ఎదురవుతాయని, కనుక జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే శుభ్రత లేకుండా పండ్ల రసాలను తయారుచేస్తారో బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. సహజంగా పండ్ల రసాలలో ఉపయోగించే ఐస్ తయారీకి సంబంధించిన నీళ్లు పరిశుభ్రంగా ఉండవు. అంతేకాకుండా వాటిని తయారు చేయడం, నిల్వ చేయడం, లేదా రవాణా చేసే సమయంలో పరిశుభ్రత అస్సలు ఉండదు.

ముఖ్యంగా, ట్రాలీలు, ఆటోలలో ఐస్‌ను తరలిస్తూ ఉంటారు. ఈ విధంగా నిల్వ చేయడానికి ప్లాస్టిక్ డ్రమ్ములను ఉపయోగిస్తారు మరియు పానీయాల్లో కలుపుతారు. వీటివలన ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఇలా తయారుచేసిన ఐస్‌ను పండ్ల రసాలలో ఉపయోగిస్తే, గొంతు నొప్పి చాలా సాధారణంగా మారుతుంది. గొంతు నొప్పితో పాటు దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనబడతాయి. కనుక, ఇంట్లో తయారు చేసుకుని పండ్ల రసాలను తాగడం మేలు. ఎప్పుడైతే తరచుగా ఈ సమస్యలు ఎదురవుతాయో గొంతుకు సంబందించిన సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. కనుక అటువంటి ఆహారాలను మరియు పానీయాలను ఎక్కువగా తీసుకుపోవడమే మేలు.

Read more RELATED
Recommended to you

Latest news