తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సుపారీ గ్యాంగ్ ఒక్కసారిగా కలకలం రేపింది. వీరు బీజేపీ నాయకుడి హత్యకు కుట్ర పన్నినట్లు సమాచారం.మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కర్నూల్, కర్ణాటక రౌడీ షీటర్లు కుట్ర చేసినట్లు తెలుస్తోంది.
గతంలో ఓ హత్య కేసులో ప్రశాంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతని హత్యకు ఏకంగా రెండున్నర కోట్లకు డీల్ కుదిరినట్లు ఆడియో వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అతన్ని హత్య చేసేందుకు ఎవరు అంత పెద్ద మొత్తంలో సుపారీ గ్యాంగ్‌కు డబ్బులు ఇచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సుపారీ గ్యాంగ్ కలకలం.. బీజేపీ నాయకుడి హత్యకు కుట్ర…!
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కర్నూల్, కర్ణాటక రౌడీ షీటర్ల కుట్ర
గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి
రెండున్నర కోట్లకు డీల్ కుదిరినట్లు ఆడియో వైరల్… pic.twitter.com/CqnqPKc4L7
— BIG TV Breaking News (@bigtvtelugu) April 20, 2025