హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలోని నార్త్‌స్టాండ్‌కు మహ్మద్ అజహరుద్దీన్ పేరును తొలగించాలని హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలపై అజహరుద్దీన్ తాజాగా స్పందించారు. దీనిపై తాను ఎలాంటి కామెంట్ చేయదల్చుకోలేదు అంటూనే ఈ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. HCAను చూసి క్రికెట్ ప్రపంచం నవ్వుతోందని అన్నారు.
17 ఏళ్ల క్రికెట్ కెరీర్.. పదేళ్లపాటు భారత జట్టు కెప్టెన్ గా ఉన్న తాను సారథిగా డిస్టింక్షన్ లో పాసయ్యానని అన్నారు. హైదరాబాద్ లో క్రికెటర్లను ఇలాగేనా గౌరవించేదని మండిపడ్డారు. ఇది చాలా బాధాకరమని.. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయిస్తానని.. న్యాయస్థానంలో తనకు వంద శాతం న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు అజహరుద్దీన్ తెలిపారు.
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నపుడు అజహరుద్దీన్ తన పేరును ఓ స్టాండ్‌కు పెట్టించారు. అయితే ఇది సరైన నిర్ణయం కాదని, ఇందులో విరుద్ధ ప్రయోజనాలున్నాయని అంబుడ్స్‌మన్ పేర్కొంటూ.. వెంటనే స్టాండ్‌కు అజహర్ పేరును తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే క్రికెట్ మ్యాచ్‌ల టికెట్లపైనా ఆ ప్రస్తావన లేకుండా చూడాలని హెచ్‌సీఏను ఆదేశించారు.