ఏపీ లిక్కర్ స్కామ్ పై తొలిసారి విజయసాయి రెడ్డి షాకింగ్ ట్వీట్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్ అన్నారు. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారని పేర్కొన్నారు . ఏ రూపాయి నేను ముట్టలేదని వెల్లడించారు విజయసాయి రెడ్డి. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తానన్నారు విజయసాయి రెడ్డి.

కాగా, ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి) తాజాగా మరో ఆడియో రిలీజ్ చేశారు. మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో తాను ఈ కేసులో సిట్ విచారణకు హాజరవుతానని తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్ కసిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు మధ్యంత బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను వారానికి వాయిదా వేసింది.
ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2025