22 తారీఖు వచ్చినా జీతాలు ఇంకా రాలేదు : కార్మికులు

-

రాష్ట్రంలో 22వ తేదీ వచ్చినా నేటికీ ప్రభుత్వం నుంచి తమకు వేతనాలు రాలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కల్వకుర్తి మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు జీతాలు రాకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

22వ తారీఖు వచ్చినా తమకు ఇంకా జీతాలు ఇవ్వలేదని..ఇంట్లో తిననీకే తిండి లేక మిత్తిలకు పైసలు తెచ్చుకుంటున్నామని.. మురికి పనులు చేసే మేము తిండి కూడా తినకూడదా? అంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పాత మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే స్పందించి తమకు జీతాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news