నాలుగో సారి ముఖ్యమంత్రి గా రాష్ట్రంలో ఇప్పటివరకు చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదు అని మాజీ మంత్రి ఆర్.కే.రోజా పేర్కొన్నారు. ఇప్పుడు ఏదో మొదలుపెట్టారు. మాట్లాడితే జగన బెంగళూరు వెళ్తున్నారు అంటున్నారు. గతంలో మీరు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. శుక్రవారం అయితే హైదరాబాద్ కి వెళ్లిపోతున్నారు. మీరు హైదరాబాద్ లో ఉండటం వల్లే వరదలకు విజయవాడ మునిగిపోయింది. అధికారంలో ఉన్న మీరు హైదరాబాద్ లో తిరుగుతున్నారని జనాలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు తన కేసులపై విచారణ ముందు చేయించుకోవాలి. కుంటి సాకులతో కేసుల నుంచి బయటికి వచ్చారంటూ వైసీపీ నేత ఆర్.కే.రోజా పేర్కొంది.
అమరావతిని దోచుకోవాలని అనుకున్న చంద్రబాబు పై ప్రధాని మోడీ విచారణ చేయించాలని ఆర్.కే.రోజా డిమాండ్ చేసింది. ప్రధాని తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. వైజాగ్ ను రాజధాని చేయాలని జగన్ కలలు కన్నారు. పరిపాలన రాజధాని చేస్తే.. వైసీపీ వల్ల అరాచకాలు చేస్తారని భయపెట్టారు. వైజాగ్ లో 60రోజుల ముందు పుట్టిన ఉర్సా కంపెనీకి మూడువేల కోట్లు భూములు ధారాదత్తం చేశారు.