భారత పౌరసత్వం లేకుండా ఎన్నికల్లో పోటీ చేసిన వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ వీడియోలో మాట్లాడారు. భారత పౌరసత్వం లేకుండా పలు దఫాలుగా వేములవాడకు శాసనసభ్యులు ఎన్నికయ్యారని.. కేంద్ర ప్రభుత్వాన్ని, న్యాయ వ్యవస్థను మోసం చేశారని నారాయణ తెలిపారు. ఎమ్మెల్యే గా ఉంటూ పలుకుబడిని ఉపయోగించుకొని కోట్లాది రూపాయలు అనుభవించారని ఆరోపించారు.
రమేష్ పౌరుడు కాదని తేల్చి చెప్పిన కోర్టు, కేసు వేసిన ఆది శ్రీనివాస్ కి కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.25లక్షలు ఇవ్వాలని తీర్పు ఇచ్చిందన్నారు. అలాగే తను అనుభవించిన ప్రభుత్వ జీతం అంతా మొత్తం తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే పదవీని ఉపయోగించుకొని మోసం చేసి సంపాదించిన ఆస్తులకు ఆయనకు శిక్ష విధించాలని, దీనిపై తాము కూడా న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తామని వెల్లడించారు నారాయణ.