కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీ.కే.శివ కుమార్ లకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సీఎం, డిప్యూటీ సీఎంలను దారుణంగా హత్య చేస్తామని ఓ దుండగుడు మెయిల్ లో బెదిరింపులకు పాల్పడినట్టు విధానసౌధ పోలీసులు వెల్లడించారు. రాంపుర కు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తికి తాను కోటి రూపాయలు అప్పుగా ఇచ్చానని.. దానిని ఇంకా తిరిగి చెల్లించనందున అతన్నీ కూడా హత్య చేస్తానని మెయిల్ లో పేర్కొన్నట్టు తెలిపారు.
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సింధార్ రాజపుత్ అనే వ్యక్తి పేరిట మెయిల్ వచ్చినట్టు గుర్తించామని తదుపరి విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామన్నారు. దీంతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం నివాసాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.