హైదరాబాద్ నగరంలోని మెట్రో రైళ్లలో నిషేదిత బెట్టింగ్ యాప్ ప్రకటన లపై హైకోర్టులో పిల్ దాఖలు అయింది. న్యాయవాది నాగూర్ బాబు ఈ పిల్ వేశారు. అనంతరం ఆయన తన వాదనలు వినిపించారు. బెట్టింగ్ యాప్ లను రాష్ట్ర ప్రభుత్వం నిషేదించినా మెట్రో రైళ్లలో మాత్రం ప్రకటనలు ఇస్తున్నారు. కొన్ని బెట్టింగ్ యాప్ లపై ఇప్పటికే ఈడీ విచారణ కొనసాగుతోంది. మెట్రో రైళ్లలో ఈ ప్రకటనల పై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మెట్రో రైల్లలో 2022 తరువాత బెట్టింగ్ యాప్ ప్రకటనలు ప్రదర్శించలేదని.. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. ఇరు వైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం విచారణ ను ఏప్రిల్ 29 కి వాయిదా వేసింది.