సహజంగా ఎలాంటి అనారోగ్యకరమైన సమస్యలనైనా ఎదుర్కొనే ముందు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటిని పట్టించుకోకపోతే, సమస్య తీవ్రత మరింత ఎక్కువ అవుతుంది. అదేవిధంగా, థైరాయిడ్‌కు సంబంధించిన లక్షణాలు కూడా శరీరంలో కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కొన్నట్లయితే, తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా అలసిపోవడం, శక్తి లేకపోవడం, చర్మం పొడిబారడం, కండరాలు బలహీనంగా మారడం వంటి మొదలైన లక్షణాలు కనిపిస్తే, థైరాయిడ్ సమస్య ఉన్నట్లు భావించవచ్చు. దీనికి సంబంధించి చెకప్ చేయించుకోవడం మరియు డాక్టర్ ను కన్సల్ట్ చేయడం ఎంతో అవసరం.
థైరాయిడ్ గ్రంధి అనేది గొంతు ముందు భాగంలో ఉంటుంది. ఎప్పుడైతే దీని పనితీరు సరిగా ఉండదో, థైరాయిడ్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా ఇది పూర్తి శరీరం పై ప్రభావం చూపిస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంధి కొన్ని హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. వాటి వలన జీవక్రియ, శక్తి స్థాయిలు, హృదయ స్పందన, మరియు ఉష్ణోగ్రత నియంత్రణ వంటి ప్రక్రియలు జరుగుతాయి. కనుక థైరాయిడ్ గ్రంధి ఉత్పత్తులు సమతుల్యంగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవ్వవు. ఎప్పుడైతే హార్మోన్లలో సమతుల్యత ఏర్పడుతుందో, థైరాయిడ్ సమస్యను మరియు దానితో పాటుగా ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. థైరాయిడ్ సమస్య వలన, హార్మోనల్ అసమతుల్యతతో మానసికంగా ఎన్నో మార్పులు ఉంటాయి. చిరాకు, ఆందోళన, నీరసం వంటి లక్షణాలను ఎదుర్కొంటే ఈ సమస్య ఉందని భావించవచ్చు.
ముఖ్యంగా దీనికి సంబంధించిన సమస్యలు ప్రతిరోజు ఉదయాన్నే గమనిస్తూ ఉండాలి. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఉత్సాహం లేకుండా, విశ్రాంతి అవసరమన్నట్లు భావిస్తే, హైపోథైరాయిడిజం సమస్య ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివలన జీవక్రియ దెబ్బతింటుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత కళ్లకు సంబందించిన సమస్యలను గమనించవచ్చు. ఉదయం కళ్లు ఉబ్బినట్లు లేదా కనురెప్పలు భారంగా అనిపించడం, ముఖంపై వాపు రావడం వంటివి కనిపిస్తే ఈ సమస్యకు సంబంధించి పరీక్షలు నిర్వహించి తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు హృదయ స్పందనలో మార్పులను కూడా గమనించవచ్చు. హైపోథైరాయిడిజం సమస్య ఉంటే, హృదయ స్పందన నెమ్మదిగా ఉంటుంది. ఎవరిలో అయితే థైరాయిడ్ సమస్య ఉంటుందో, వారి చర్మం పొడిగా, నిర్జీవంగా మారడం కనిపిస్తాయి. అలాగే, ప్రతిరోజు ఉదయాన్నే జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతాయి.