మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. ఇవాళ హైదరాబాద్ లో వైన్స్ బంద్ కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో జరిగిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం సాఫీగా, ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో 78.57% పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ ఎటువంటి అడ్డంకులు లేకుండా సాయంత్రం 4 గంటలకు పూర్తయింది. ఈ ఎన్నికల్లో మొత్తం 88 ఓట్లు వేయబడ్డాయి.

అందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 25న అంటే ఇవాళ ఉదయం 8 గంటల నుంచి GHMC ప్రధాన కార్యాలయంలో జరగనుంది. లెక్కింపు కోసం అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించబడుతుంది. అయితే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో వైన్స్ బంద్ కానున్నాయి.