ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. వేట నిషేధ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం పెంచింది. ‘మత్స్యకార సేవలో’ పేరుతో జాలర్లకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు రూ. 258 కోట్ల మేర లబ్ది చేకూరనుంది.

ఈ తరుణంలో ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ” మత్స్యకారుల సేవలో ” పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… సముద్రంలో వేటకు విరామ సమయంలో ఆర్థిక సాయం అందించనుంది. మత్స్యకారుల కుటుంబాలకు రూ.20 వేల చొప్పున జమ చేస్తారు. అనంతరం మత్స్యకారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖీ ఉంటుంది.