కర్నూలులో ఆర్టీసీ డ్రైవర్‌పై యువకుడి దాడి!

-

కర్నూలులో ఆర్టీసీ డ్రైవర్‌పై యువకుడి దాడి జరిగింది. కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ యువకుడు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. పట్టణంలోని రాయనగర్‌కు చెందిన భూపేష్ అనే యువకుడు ఆర్టీసీ బస్సుకు అడ్డంగా వచ్చి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు.

RTC driver attacked by youth in Kurnool

అంతటితో ఆగకుండా బస్సు ఎక్కి డ్రైవర్‌పై కర్రతో దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. కాగా.. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news