సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల హాసన్ హీరోగా ‘ఇండియన్ 2’ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇటీవల క్రేన్ యాక్సిడెంట్ అయ్యి పలువురు మరణించడం జరిగింది. దీంతో యాక్సిడెంట్ కి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు విచారణలో భాగంగా డైరెక్టర్ శంకర్ ని అదేవిధంగా హీరో కమల్ హాసన్ కు ముందుగా సామాన్లు పోలీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరూ ఇటీవల పోలీసులు జరిగిన ప్రమాదానికి సంబంధించి వివరాలను మరియు కొన్ని ప్రశ్నలను అడిగి సమాధానాలను తెలుసుకోవడం జరిగింది. ఇదే సమయంలో హీరోయిన్ కాజల్ కూడా ఆ దారుణమైన ఘటన జరిగిన సందర్భంలో ఉండటంతో పోలీసులు కాజల్ ని కూడా విచారించడానికి ఆమెకు సామాన్లు జారీ చేయడం జరిగింది.
అయితే ఈ సందర్భంలో పదే పదే పోలీసులు విచారణ నిమిత్తం రెండుసార్లు కాజల్ కి సామాన్లు జారీ చేసినట్లు తమిళ మీడియా వర్గాల్లో వార్తలు రావడంతో సోషల్ మీడియాలో ఆమె అభిమానులు కాజల్ ని ఎందుకంత ఇబ్బంది పెడుతున్నారు ?? కావాలనే ఇదంతా చేస్తున్నారని మండిపడుతున్నారు. అసలు నిర్మాతలను మరియు డైరెక్టర్, హీరోలకు అంత సీన్ ఇవ్వకుండా…కేవలం కాజల్ అగర్వాల్ నే పోలీసులు టార్గెట్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి మృతుల కుటుంబాలు కేసు పెట్టకపోయినా స్పెషల్ గా పోలీసులు కేసు పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.