శ్రీలంక మహిళతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 148 పరుగుల టార్గెట్ ను కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 29.4 ఓవర్లలోనే ఛేదించింది టీమిండియా. ప్రతికా 50 నాటౌట్, మందాన 43, హర్లీన్ 48 నాటౌట్ గా నిలిచారు. దీంతో టీమిండియా చాలా సులువుగా విజయం సాధించింది. అంతకు ముందు భారత బౌలర్లు స్నేమ్ రానా, దీప్తి శర్మ, చరణి చెలరేగడంతో 38.1 ఓవర్లలో శ్రీలంక 147 పరుగులకే ఆలౌట్ అయింది.
హాసిని పెరీరా ఒక్కరే 30 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. మిగతా వారంతా అలా వచ్చి ఇలా వెళ్లారు. భారత బౌలర్ల ధాటికి తమ సత్తా చాటలేకపోయారు. చామరి ఆటపట్టు 7, హర్షిత మాదవి 14, కరుణ రత్నె 4, కవిష దిహారి 25, నిలాక్సి 10, అనుస్క సంజీవని 22, అచిని కులసురియ 17, పౌమి 2 పరుగులు చేశారు. మాల్కి మాదర కూడా 2 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత మహిళలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక మహిళలకు కష్టాలు తప్పలేదు.