ఈ మధ్య కాలంలో ఎన్నో కారణాల వలన గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఎంతో హఠాత్తుగా హార్ట్ ఎటాక్ తో చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా జీవన విధానంలో మార్పుల వలన ఆరోగ్యం పై శ్రద్ధ తగ్గుతోంది. అంతే కాకుండా వీటి వలన డయాబెటిస్, అధిక బరువు వంటి ఇతర సమస్యలను కూడా ఎదుర్కొవలసి వస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటును చాలా శాతం మంది ఎదుర్కొంటున్నారు. సహజంగా గుండెకు సంబంధించిన సమస్యలు వస్తే ఎంతో జాగ్రత్త వహించాలి. అయితే ఎన్నో సందర్భాలలో గుండెపోటు రావడం వలన ప్రాణానికే ప్రమాదం అని చెప్పవచ్చు.
ఎప్పుడైతే గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదో లేదా గుండె కండరాలకి బలహీనత ఏర్పడుతుందో గుండెపోటు వస్తుంది. అయితే వీటికి సంబంధించిన లక్షణాలను ముందుగానే కనిపెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చే ముందు చాతిలో నొప్పి లేక చాతిలో భారంగా అనిపించడం వంటివి జరుగుతాయి. అలాంటప్పుడు అస్సలు తేలికగా తీసుకోకూడదు. అయితే ఈ సంకేతాలు ఒక నెల ముందు నుండే కనబడితే అస్సలు అజాగ్రత్త చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చర్యలు తీసుకోవాలి.
ఎక్కువ సమయం కష్టపడి పని చేయకపోయినా అలసిపోవడం వంటి లక్షణాలు కూడా గుండెపోటుకు సంకేతం అవ్వచ్చు. గుండెపోటు వచ్చే ముందు రోజు రోజుకి అలసట పెరుగుతూ వస్తుంది మరియు ముఖ్యంగా మహిళల్లో ఈ లక్షణం కనిపిస్తుంది. ఎప్పుడైతే శ్వాసకు సంబంధించిన సమస్యలు, చాతి లో ఇబ్బంది వంటివి ఎదురవుతాయో ఎంతో జాగ్రత్త వహించాలి. ఇటువంటి సందర్భాలలో కూడా గుండెకు సంబందించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని నిపుణులు చెబుతున్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ లక్షణాలను ఎదుర్కొంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.