రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. మధ్యాహ్నం రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి పదో తరగతి ఫలితాల్లో మరోసారి బాలికలే సత్తా చాటారు.‘పది’ ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలు ఆధిపత్యం సాధించారు.
బాలురు 91.32 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. మొత్తం ఫలితాల్లో గతేడాది కంటే 1.47 శాతం ఎక్కువ ఉత్తీర్ణత నమోదవ్వడం గమనార్హం.ఈ ఏడాది 4,629 పాఠశాలలు 100 శాంత ఉత్తీర్ణత సాధించగా.. ఒక్క విద్యార్థి కూడా పాస్ అవ్వని పాఠశాలలు రెండే ఉన్నాయి. అయితే, విద్యార్థులు ఫలితాల కోసం http://results.bse.telangana.gov.in లేదా http://results.bsetelangana.org మరియు http://bse.telangana.gov.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఎస్ఎస్ఎసీ బోర్డు వెల్లడించింది.