ఇవాళ, రేపు బిజీబిజీగా ప్రధాని మోడీ

-

ఇవాళ, రేపు బిజీబిజీగా ప్రధాని మోడీ గడపనున్నారు. నేడు,రేపు మొత్తం మూడు రాష్ట్రాల్లో మోడీ పర్యటన ఉంటుంది. మహారాష్ట్ర, కేరళ, ఏపీలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు మోడీ.

కేరళలో అంతర్జాతీయ డీప్ వాటర్ మల్టీపర్పస్ ఓడరేవును జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోడీ.
ఏపీలో అమరావతి పునఃప్రారంభ పనులు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోడీ.

ఇక అటు ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. వర్షం వస్తే పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని సీఎం చంద్రబాబు సూచించారని అన్నారు.ఈ మేరకు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. మోడీ పర్యటనలో భాగంగా 3000 బస్సులు, 1000 కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు.అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news