ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్ పనులకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం అందించింది. రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని జగన్‌ను కూటమి నేతలు ఆహ్వానించారు.
కాగా, రేపు ప్రధాని మోడీ సభకు సైతం హాజరు కావాలని తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను ప్రొటోకాల్ అధికారులు అందజేశారు. అయితే, నిన్న సాయంత్రం జగన్ ఇంటి దగ్గర లేకపోవడంతో ఆయన PA నాగేశ్వర రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేసినట్లు సమాచారం. కాగా, జగన్ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించలేదు. దీనికి తోడు మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారు. కానీ, కేంద్రం మాత్రం అమరావతినే రాజధానిగా పలుమార్లు పార్లమెంటులోనూ ప్రస్తావించింది. జగన్ ఈ వేడుకకు హాజరవుతారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.