మందుబాబులు అప్పుడప్పుడు రచ్చ చేస్తూ ఉంటారు. తాగిన తర్వాత ఏం చేస్తారో వాళ్లకే తెలియని పరిస్థితులు ఉంటాయి. మరికొంతమంది మందు తాగినందుకు అనేక స్కెచ్ లు కూడా వేస్తూ ఉంటారు. పందాలు కూడా కాస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే… ఏకంగా ఐదు ఫుల్ బాటిల్స్ తాగి 21 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు. అది కూడా… మంచినీళ్లు కలుపుకోకుండా ఐదు ఫుల్ బాటిల్స్ ఏకంగా తాగేశాడు ఆ కుర్రాడు.

ఈ దెబ్బకు స్పాట్లోనే మృతి చెందాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో స్నేహితులతో కార్తీక్ అనే కుర్రాడు పందెం కాసాడు. పదివేల రూపాయల పందెం కాసి 5 ఫుల్ బాటిల్స్ తాగాడు. అదికూడా మంచినీళ్లు కలుపుకోకుండా మందు తాగాడు. దీంతో పరిస్థితి విషమించడంతో స్నేహితులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుర్రాడు మృతి చెందాడు.