ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో ఇవాళ పర్యటించారు. ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెంలో ఎస్టీ కాలనీలో పర్యటించి.. పేదల సేవలో పింఛన్ పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద చలంచర్ల సుస్మితకు వితంతు పెన్షన్ పంపిణి చేశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. టీటీసీ చదివిన సుస్మితకు డీఎస్సీలో ఉద్యోగం కోసం ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.
అలాగే ఐదేళ్ల చిన్నారి ఛేత్రికను గురుకుల పాఠశాలలో చేర్పించి.. ఉచితంగా నాణ్యమైన చదువు చెప్పించే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు. పేద కుటుంబంలోని అంకోజి-సుమా కుమారుడికి వ్యవసాయ రంగంలో డ్రోన్ శిక్షణతో పాటు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. అలాగే నారంపేట నుంచి MSME పార్కులను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడారు. కార్మికులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానిది అని.. భవన నిర్మాణ కార్మికులు ఐదేళ్లు అనేక ఇబ్బందు పడ్డారని తెలిపారు. కార్మికులు అంటే ఫ్యాక్టరీలలో పని చేసే వాళ్లే గుర్తుకొస్తారు. కానీ 88 శఆతం అసంఘటిత కార్మికులే ఉన్నారు. వారిలో ఎక్కువగా వ్యవసాయం మీధే ఆధారపడుతున్నారని తెలిపారు సీఎం చంద్రబాబు.