పీఎస్ఎల్ వల్ల క్వాలిటీ ప్లేయర్స్ దొరకడం లేదు : రికీ పాంటింగ్

-

ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే పీఎస్ఎల్ కూడా జరుగుతుండటంతో తమకు క్వాలిటీ ప్లేయర్లు దొరకడం లేదని పీబీకేఎస్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అన్నారు. గాయాల వల్ల మా జట్టు ఆటగాళ్లు ఫెర్గూసన్, మ్యాక్స్ వెల్ టోర్నీకి దూరమయ్యారు. వారి స్థానాలను రీప్లేస్ చేసుకునేందుకు నాణ్యమైన ఆటగాళ్లు దొరకడం లేదు. ఇందుకు పీఎస్ఎల్ ఓ కారణం అనుకుంటున్నా.. అయినా అందుబాటులో ఉన్న జట్టుతోనే మేము మ్యాచ్ లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పంజాబ్ కింగ్స్ జట్టు నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో నెంబర్ 2 స్థానానికి చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 14 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. 13 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో ముంబై ఘన విజయం సాధిస్తే.. తొలి స్థానానికే వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news