Breaking: శ్రీలంక విమానంలో పహల్గామ్ దాడి అనుమానితులు..

-

కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతాన్ని కదిలించిన ఉగ్రదాడి తర్వాత, ఆ దాడిలో పాలుపంచుకున్న ఆరుగురు ఉగ్రవాదులు శ్రీలంకకు పారిపోయారని అనుమానాల నేపథ్యంలో శనివారం కొలంబోలో అత్యున్నత భద్రతా తనిఖీలు నిర్వహించారు. భారత అధికారుల నుంచి వచ్చిన అత్యవసర సమాచారాన్ని ఆధారంగా, శ్రీలంక భద్రతా బలగాలు మధ్యాహ్నం 11:59 గంటలకు బండరానాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన శ్రీలంక ఎయిర్‌లైన్స్ UL122 విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశాయి. ఈ విమానంలో పహల్గామ్ దాడిలో పాల్గొన్నవారే ప్రయాణిస్తున్నారన్న అనుమానంతో, శ్రీలంక పోలీసులు, ఎయిర్‌ఫోర్స్, మరియు విమానాశ్రయ భద్రతా దళాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి వచ్చిన హెచ్చరికల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు.

 

గతవారం జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ప్రధాన నిందితుడిగా గుర్తించబడిన హషీం ముసా ఒకప్పటి పాకిస్తాన్ ఆర్మీ కమాండోగా సమాచారం. మత విద్వేషాల నేపథ్యంలో హిందువులనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్టు తెలుస్తోంది. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి బాధ్యత వహించుకుంది. ఈ పరిణామాలతో భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. శ్రీలంకలో జరిగిన ఈ హై అలర్ట్ తనిఖీలు, ఉగ్రవాదుల అంతర్జాతీయ సంబంధాలపై మరోసారి దృష్టిని సారించాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news